ట్రంప్‌కు శుభాకాంక్షలు: మిల్లెట్స్‌తో చిత్రం
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన సందర్భంగా విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్, మిల్లెట్స్‌తో ట్రంప్ చిత్రపటాన్ని రూపొందించారు. ట్రంప్ ఎన్నిక విజయాన్ని సూచించేలా, మిల్లెట్స్‌తో నిర్మించిన ఈ చిత్రం, ట్రంప్‌ను విజయ చిహ్నంగా చూపిస్తుంది. ట్రంప్ చిత్రం వెనుక భాగంలో అమెరికా జెండాను సైతం మిల్లెట్స్తోనే తీర్చిదిద్దారు. ఈ చిత్రం ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా ఉంది. భారత అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని విజయ్ కుమార్ కోరుకుంటున్నట్లు చెప్పారు. విశాఖ చిత్రకారుడి ప్రతిభకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
ట్రంప్, మెజారిటీ సీట్లను సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ 277 సీట్లు గెలుచుకుంటే, కమలా హారిస్‌కు 226 సీట్లు లభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.