అమెరికా రాజకీయాల్లో తులసి గబ్బార్డ్
తులసి గబ్బార్డ్.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన వెంటనే కీలక పదవులను అధిరోహించిన వారిలో ఒకరు. చివరి క్షణంలో డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఆమెకు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో ఆమె అమెరికాలోని 18 నిఘా ఏజెన్సీలకు అధిపతిగా మారారు.
2022లో డెమొక్రటిక్ పార్టీని వీడిన ఆమె ఈ ఏడాది ప్రారంభంలో రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఆమె అమెరికాకు గర్వ కారణం అవుతారని ట్రంప్ ప్రశంసించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా ఉక్రెయిన్ కు మద్దతునివ్వడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు తనకు అత్యున్నత పదవి దక్కడం పై ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తులసి పేరు విని చాలా మంది ఆమె భారతీయురాలని భావిస్తారు. కానీ, ఆమె అమెరికన్ పౌరురాలు. హిందూ మతాన్ని స్వీకరించిన తులసి భగవద్గీతను చదివి, విష్ణు భక్తురాలిగా మారారు.
తులసి లియోనోలా, అమెరికాలో 12 ఏప్రిల్ 1981లో జన్మించారు. ఆమె తల్లి కారోల్ ఇండియానాకు చెందినవారు. తులసికి రెండేళ్లున్నప్పుడు వారి కుటుంబం హవాయీ దీవుల్లో స్థిరపడ్డారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన ఆమె అబ్రహం విలియమ్స్ అనే సినిమాటోగ్రఫర్ ను పెళ్లి చేసుకున్నారు. తన తల్లికి హిందుత్వంపై ఉన్న మమకారం కారణంగా తన పిల్లలందరికీ హిందూ పేర్లనే పెట్టారు. చిన్నతనం నుంచే హిందూ ఆచారాలను పాటిస్తూ పెరిగిన తులసి కూడా వైష్ణవ భక్తురాలిగా మారారు. భగవద్గీత పఠనం, ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవడం వంటివి చేస్తుంటారు. గతంలో పదవీ స్వీకారం సమయంలోనూ ఆమె భగవద్గీతపై ప్రమాణం చేయడం అందరిని ఆకర్షించింది. తనను చూసిన వారంతా భారతీయురాలని పొరబడుతుండటంతో ఈ విషయంపై తులసి క్లారిటీ ఇచ్చారు. తాను భారత పౌరురాలిని కాదంటూ 2012లోనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.