అధ్యక్ష మార్పు ముందు న్యాయ వ్యవస్థలో గందరగోళం
అమెరికాలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా ఫెడరల్ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాన్ని వేగంగా కొనసాగిస్తూ షాక్ ఇచ్చారు
. ఈ క్రమంలో, బైడెన్ తన నామినీలను నియమించడంపై ట్రంప్ మరియు ఆయన అనుచరులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
వచ్చే జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, బైడెన్ తమ పదవిని వీడేలోగా ఎక్కువ మంది ఫెడరల్ న్యాయమూర్తులను నియమించడానికి ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ పాలనలో 234 మంది న్యాయమూర్తులను నియమించగా, బైడెన్ అధ్యక్ష పదవి ప్రారంభమైనప్పటి నుంచి 213 మంది జ్యూడిషియల్ నామినీలను నియమించారు. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కేతంజీ బ్రౌన్ జాక్సన్ కూడా ఉన్నారు.
బైడెన్ నామినీలను సెనెట్ ఆమోదించడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, సెనెట్ ఆమోదించిన న్యాయమూర్తులను తొలగించడం సాధ్యం కాదు. ట్రంప్ పదవిలో ఉన్నప్పటికి డెమోక్రాట్లు నియమించిన న్యాయమూర్తులతో తమ పాలనను కొనసాగించాలని చూస్తున్నారని ట్రంప్ విమర్శిస్తున్నారు.