మెగా ప్రిన్స్ ‘మట్కా’కు ఓవర్సీస్లో నిరాశ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు భారీ బజ్‌ను సృష్టించాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ‘మట్కా’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 62 లొకేషన్స్‌లో 108 షోస్‌కు కేవలం 324 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది మెగా ఫ్యామిలీ హీరోకు దారుణమైన విషయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుణ్ తేజ్ తన గత చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం ఈ బుకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు.
‘మట్కా’ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటేనే ఈ సినిమా పుంజుకుంటుందని అంటున్నారు. శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో విడుదల చేస్తోంది.